Share News

Chief Minister MK Stalin: నా బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతా..

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:27 PM

తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత నేత కరుణానిధిని ఆదర్శంగా తీసుకుని శ్రమించడమే కాకుండా, అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.

Chief Minister MK Stalin: నా బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతా..

  • ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై: తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత నేత కరుణానిధిని ఆదర్శంగా తీసుకుని శ్రమించడమే కాకుండా, అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. గురువారం ఉదయం తన నియోజకవర్గం కొళత్తూరులో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


పెరంబూరు పేపర్‌మిల్స్‌ రోడ్డులో రూ.8.20 కోట్లతో మురసొలి మారన్‌ ఉద్యానవనం పునర్నిర్మాణ పనులకు, కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.13.95 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొళత్తూరు నియోజకవర్గంలో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.8.65 కోట్లతో నిర్మించిన రెండు పాఠశాల భవనాలు, పునర్నించిన ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత జవహర్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు సహాయాలు అందజేశారు.


చివరగా పెరియార్‌ నగర్‌ క్రీడామైదానంలో అనితా అఛీవర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 126 మంది విద్యార్థినీ విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు, సర్టిఫికెట్లు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో అడుగుపెట్టగానే తనలో సంతోషం ఏర్పఉతుందని, ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆనందిస్తున్నానని చెప్పారు. రెండు గంటలపాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనితా అచీవర్స్‌ అకాడమీలో విద్యార్థులందరినీ చూడగానే తనలో మరింత చురుకుదనం ఆవహిస్తోందని చెప్పారు.


nani2.2.jpg

ఈ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా తమ పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలలో మరింతగా ప్రతిభాపాటవాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో అంతర్జాలంలో లభించన సమాచారం అంటూ ఏదీ లేదని, అన్వేషిస్తే అన్ని వివరాలు అర్థమవుతాయన్నారు. ఆన్‌లైన్‌ కోర్సులపై కూడా యువత దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి పీకే శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ, ఎంపీ డాక్టర్‌ కళానిధి వీరాసామి, రాజ్యసభ సభ్యుడు గిరిరాజన్‌, ఎమ్మెల్యేలు తాయగం కవి, జోసె్‌ఫసామువేల్‌, వెట్రి అళగన్‌, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, డీఎంకే స్థానిక నాయకులు నాగరాజన్‌, ఐసీఎఫ్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 12:27 PM