Share News

Assembly Elections: అధికారంలో భాగస్వామ్యం కావాలని రాహుల్‌ కోరలేదు

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:04 AM

రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్‌ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్‌ జంక్షన్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

Assembly Elections: అధికారంలో భాగస్వామ్యం కావాలని రాహుల్‌ కోరలేదు

- టీఎన్‌సీసీ నేత సెల్వపెరుంతగై

చెన్నై: రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్‌ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్‌ జంక్షన్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే కోరుకుంటోందని, ప్రతి ఎన్నికల్లోనూ సీట్లు పెంచాలని మాత్రమే కూటమికి నేతృత్వం వహిస్తున్న డీఎంకేను డిమాండ్‌ చేస్తోందన్నారు.


nani2.2.jpg

అదే సమయలో అధికారంలో భాగస్వామం కావాలని కాంగ్రెస్‌ నాయకులెవరూ కోరలేదని స్పష్టం చేశారు. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కాపాడిందంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చెప్పడం చూస్తుంటే అన్నాడీఎంకే నేతలంతా బీజేపీకి బానిసలుగా వ్యవహరించారని స్పష్టమవుతోందని సెల్వపెరుంతగై ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ నేతలు ఎస్‌.తిరునావుక్కరసర్‌, కేవీ తంగబాలు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2025 | 11:04 AM