Share News

Minister: మంత్రి ఎద్దేవా.. జనం కోసమే సెలవు రోజుల్లో విజయ్‌ ప్రచారం

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:56 PM

తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.

Minister: మంత్రి ఎద్దేవా.. జనం కోసమే సెలవు రోజుల్లో విజయ్‌ ప్రచారం

చెన్నై: తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌(Vijay) వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి(Raghupati) విమర్శించారు. పుదుకోటలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ్‌ రాకవల్ల డీఎంకే ఓటు బ్యాంక్‌ ఏ మాత్రం తగ్గే అవకాశమే లేదన్నారు. విజయ్‌ పర్యటనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతోందని, పోలీసు నిబంధనలు ఉల్లఘించి సభలు జరుపుతున్నారని,


అందువల్లే పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారని తెలిపారు. 2011లో డీఎంకేకు మద్దతుగా హాస్యనటుడు వడివేల్‌ ప్రచారం చేసినప్పుడు ప్రస్తుతం విజయ్‌ రోడ్‌షోల కంటే అధికసంఖ్యలో జనాలు వచ్చారని ఆయన చెప్పారు. శని, ఆదివారాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవు కనుక యువకులను పెద్ద సంఖ్యలో సభకు వస్తారని భావించే విజయ్‌ ఆ రెండు రోజులు మాత్రమే ప్రచారం చేయడం గర్హనీయమని మంత్రి రఘుపతి అన్నారు.

nani5.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 01:56 PM