MP Jyothimani: మా కార్యకర్తలను చేర్చుకోవడం కూటమి ధర్మానికే విరుద్ధం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:11 AM
డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్‌ఛార్జి సెంథిల్ బాలాజీ కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది.
- డీఎంకే నేత సెంథిల్‌బాలాజీపై ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం
చెన్నై: డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్‌ఛార్జి సెంథిల్ బాలాజీ కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే(DMK) సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి(Congress MP Jyothymani) ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది. ఈ నేపథ్యంలో ఇటీవల సెంథిల్ బాలాజీ తన ఎక్స్‌పేజీలో కరూరు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత డీఎంకేలో చేరారని, దేశానికి స్టాలిన్ నాయకత్వం అవసరమనే ఆలోచనతోనే కవిత డీఎంకేలో చేరినట్లు ఓ సందేశం వెలువరించారు.
ఆ సందేశాన్ని అర్జెంటీనాలో ఉన్న జ్యోతిమణి గమనించి సెంథిల్ బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌పేజీలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. కూటమి ధర్మం రెండు వైపులా ఉండాలని, ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీని బహి రంగంగా ఇలా అవమానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించా రు. పరస్పర అవగాహన, సహకా రం, నమ్మకం, గౌరవం ఆధారంగానే కూటమి ఏర్పడుతుందని ఎట్టి పరిస్థితుల్లో వీటిలో ఏదీ అతిక్రమించకూదన్నారు.

తాను వెల్లడించిన అభిప్రాయాలను టీఎన్‌సీసీ నేత సెల్వపెరుంతగై, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అర్థంచేసుకోగలుగుతారని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ వివాదానికి సంబంధించి రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాలు హసీనా సయ్యద్ ఓ ప్రకటన చేస్తూ సెంథిల్‌బాలాజీ సమక్షంలో డీఎంకే సభ్యత్వం స్వీకరించిన మహిళ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కారని, ఇదిగమనించిన సెంథిల్‌బాలాజీ కూడా తప్పు జరిగిందంటూ ఎక్స్‌పేజీలో పెట్టిన ఆ సందేశాన్ని తొలగించారని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News