Share News

Assembly Elections: అభ్యర్థుల ఎంపికపై వారిద్దరిదే తుది నిర్ణయం..

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:52 PM

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి పేర్కొన్నారు.

Assembly Elections: అభ్యర్థుల ఎంపికపై వారిద్దరిదే తుది నిర్ణయం..

  • డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి

పుదుచ్చేరి: తమిళనాడు, పుదుచ్చేరి(Tamilnadu, Puduchery) రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharathi) పేర్కొన్నారు. పుదుచ్చేరి కదిర్‌గామం నియోజకవర్గంలో డీఎంకే ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం, గ్రంథాలయం, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం జరిగింది.


ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి డీఎంకే నాయకులు, ఎమ్మెల్యే శివ, తంగవేలు, వడివేల్‌, తమిళవానన్‌తో కలిసి ఆర్‌ఎస్‌ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో ఏర్పాటు చేసిన కూటమి పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందన్నారు. ‘ఏకతాటిపై తమిళనాడు’ పేరుతో డీఎంకే మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారని, ఇప్పటివరకు 2.70కోట్లమంది సభ్యులుగా చేరినట్లు ఆయన వివరించారు.


nani3.2.jpg

వచ్చేవారంలో పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పుదుచ్చేరిలోని 30, తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరుఫున నియోజకవర్గాల విభజన, అభ్యర్థులను కూటమి అగ్రనేతలైన స్టాలిన్‌, రాహుల్‌గాంధీ ఎంపికచేస్తారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 12:52 PM