Home » Dharmavaram
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్‌బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు.
పోలీస్ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పో లీస్ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్ చేశారు.
పోలీసుల నిబం ధనలు తప్పక పాటించి విక్ర యాలు జరపాలని డీఎస్పీ హే మంతకుమార్ టపాసుల వి క్రయదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల క్రీడామై దానంలో టపాసుల దుకా ణా లు ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని ఆయన ఆదివారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి, బీమా సదుపాయం కల్పించం డం బాధిత కుటుంబాలకు ఓ వరంలా నిలుస్తోందని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఇటీవల మం డలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల ఆదినరసింహులు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో పరిటాలశ్రీరామ్ చొరవతో పార్టీ కార్యాల యం నుంచి ప్రమాద బీమా రూ.5లక్షలు మంజూరైంది.
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓ శివశంకర్ పర్యటిం చారు. రోడ్డుపై మురుగునీటి నిల్వ, చెత్త దిబ్బలు ఉండటంతో... ఇలా ఉం టే రోగాలు రావా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... ఇళ్ల్ద నుంచి రోడ్డుపైకి నీరు వదలకూ డదని, ఇంటివద్దే సోపిట్ ఏర్పాటుచేసుకోవాలన్నారు.
మండల పరిధిలోని మోటుమర్ల గ్రామం వద్ద ఉన్న వంతెనపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాలకు పగలు, రాత్రి సమయాల్లో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే వంతెనపై రక్షణ దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు.
హైకోర్టు బెంచను కర్నూల్‌లో ఏ ర్పాటుచేయాలని బార్ అసోసియేషన ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధ వారం స్థానిక కోర్టు ఆవరణంలో నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన ఆధ్వర్యంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు విదులను బహిష్క రిస్తున్నట్లు ప్రకటించారు.
మండలంలోని చిగి చెర్ల గ్రామంలో ప్రసి ద్ధి గావించిన మారె మ్మ, ముత్యా లమ్మ దేవతల ఆల యంలో మంగళ వారం ప్రత్యేక పూజ లు చేశారు. మూల విరాట్లకు ఆలయ పూజారి ఆకుపూజ చేశారు. వేపమండలు, నిమ్మకాయలు, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అమ్మవార్లకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు.
నియోజకవర్గంలో ట్రాక్టర్ కార్మికు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మసుగుమధు డిమాండ్‌చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక గాందీనగర్ సర్కిల్ నుంచి సీపీఐ ఆధ్వ ర్యంలో ట్రాక్టర్ కార్మికులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.