PULSPOLIO: నేడే పల్స్‌పోలియో
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:51 PM
డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్‌పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్‌పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.
పిల్లలకు చుక్కలు వేయించండి : డిప్యూటీ డీఎంహచఓ
ధర్మవరంరూరల్, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్‌పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్‌పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు. పట్టణంలో 259బూతలలో 52,352మంది చిన్నారులకు, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
ఎవరైనా ఆదివారం వేయించుకోకపోతే సోమ, మంగళవారాల్లో వైద్యసి బ్బంది ఇంటింటీకి వచ్చి వేస్తారని తెలిపారు. వైద్యులు సురేష్, ప్రియా, శ్రావణి, శ్వేత, హెల్త్ అసిస్టెంట్లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
కదిరి: డివిజన పరిధిలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కా ర్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచఓ నాగేంద్ర పేర్కొన్నారు. సంబంధిత పోస్టర్లను ఆయన స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శనివారం విడుదల చేశారు. బస్టాండ్‌లు, కూడళ్లు, అంగనవాడీ కేంద్రా లు, ఆస్పత్రులు, పాఠశాలల్లో ఆదివారం పల్స్ చుక్కలు వేస్తారన్నారు. ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నల్లమాడ: మండల వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీహెచఓ రామాం జులు సూచించారు. దీనిపై శనివారం ఆయన ఆధ్వర్యంలో మండల పరిధిలోని రెడ్డిపల్లిలో ర్యాలీ నిర్వహించారు. హెల్త్ సూపర్‌వైజర్లు మహబూబ్‌బాషా, పార్వతమ్మ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....