Share News

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:51 PM

దేశంలో హిందూసమాజాన్ని శక్తివంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని, అందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర, కోణ కణ్వాశ్రమం దత్తానందగిరి స్వామి పే ర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదా నంలో ఆదివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

RSS: ప్రసంగిస్తున్న అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర

హిందువుల్లో జాగృతి కోసం హిందూ సమ్మేళనం

ధర్మవరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): దేశంలో హిందూసమాజాన్ని శక్తివంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని, అందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత సహ సంఘటక్‌ దేవేంద్ర, కోణ కణ్వాశ్రమం దత్తానందగిరి స్వామి పే ర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదా నంలో ఆదివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచంలో హిందూ ధర్మానికి సమానం ఏదీలేదన్నారు.


రాబోయేరోజుల్లో దేశాన్ని, హిందూధర్మాన్ని నాశనం చేసేందుకు కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. హిందూసమాజం శక్తివంతం అయ్యేందుకు హిందువు లంతా ఐక్యమ త్యంతో కదిలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా అసోసియే షన జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వరరెడ్డి తదితరుల సమక్షంలో వి ద్యార్థులు యోగాసనాలు చేశారు. నాట్యచార్యులు బాబుబాలాజీ శిష్య బృందం నృత్య ప్రదర్శనచేశారు. ఈ కార్యక్రమంలో హిందూసమ్మేళన సంఘ్‌ నాయకులు గుద్దిటి రామచంద్ర, అయ్యప్పస్వామి సేవాసమితి గురుస్వామి విజయ్‌కుమార్‌, వీహెచపీ విభాగ్‌ కార్యావాహ పులిచెర్ల వేణుగోపాల్‌, ఇస్కాన సంస్థ ప్రతినిధి మాధవదాస్‌ప్రభు, బీజేపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ యశ్రీ, న్యాయవాదులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తదతరులుు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 21 , 2025 | 11:51 PM