Ananthapuram News: రప్పా.. రప్పా.. ఇంకా ఉందప్పా..!
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:28 AM
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.
- మూడోరోజూ కేసులు.. అరెస్టులు
అనంతపురం: జగన్(Jagan) పుట్టిన రోజు వేడుకలలో అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలు చిక్కుల్లో పడుతున్నారు. జగన్ ఫ్లెక్సీలకు పొట్టేళ్లను బలి ఇచ్చి, రక్తాభిషేకం చేసినవారిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అరెస్టులు కొనసాగుతున్నాయి. వేట కొడవళ్లు పట్టుకుని నృత్యాలు చేయడం, మూగ జీవాలను బలి ఇవ్వడం, ‘రప్పా.. రప్పా..’ అని రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడినవారిని పోలీసులు వెతికి పట్టుకుంటున్నారు. మూడో రోజు బుధవారం ధర్మవరం(Dharmavaram) పట్టణంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేసి, కదిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్‌పై వదిలిపెట్టారు.

- ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జగన్ పుట్టిన రోజున తమను భయభ్రాంతులకు గురిచేశారని గ్రామస్థులు రూరల్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సురేష్ రెడ్డి, మరో ఎనిమిది మంది జగన్ ఫ్లెక్సీల వద్ద జంతు బలి ఇచ్చారని, టపాసులు పేల్చి, రప్పారప్పా నరుకుతాం అంటూ కొడవళ్లు చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News