CHRIST MAS: క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన చర్చీలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:39 PM
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన చర్చీలు బుధవారం రాత్రి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో పట్టణంలోని ఆయా చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైల్వేస్టేషన క్యాంపస్, మార్కెట్ వీధి, జోగోనికుంట, కొత్తపేట, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, నె హ్రూనగర్‌లోని చర్చీలు క్రిస్మస్ సందర్భంగా ముస్తాబయ్యాయి.
ధర్మవరం, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన చర్చీలు బుధవారం రాత్రి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో పట్టణంలోని ఆయా చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైల్వేస్టేషన క్యాంపస్, మార్కెట్ వీధి, జోగోనికుంట, కొత్తపేట, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, నె హ్రూనగర్‌లోని చర్చీలు క్రిస్మస్ సందర్భంగా ముస్తాబయ్యాయి. వాటిని విద్యుద్ దీపాలతో ప్రత్యేకంగా అ లంకరించారు. చిన్నారులు క్రిస్మస్ ట్రీలు, శాంతాక్లాజ్ వేషధారణలతో అలరించారు.
కదిరి అర్బన: క్రిస్మస్ వేడుకలకు పట్టణంలోని చర్చీలు ముస్తాబయ్యాయి. క్రైస్తవులు తమ ఇళ్లకు విద్యుత దీపాలంకరణ చేశా రు. గురువారం ఉదయం నుంచే ప్రార్థనలు ప్రారంభంకానున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో వేడుక లను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పట్టణంలో చర్చీలన్నీ విద్యుత దీప కాంతులతో వెలిగిపోతున్నాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....