Share News

PROTEST: ‘ఉపాధి హామీ’కి గాంధీ పేరే ఉండాలి

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:55 PM

గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్‌, బహుజనసమాజ్‌ పార్టీ, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్‌ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.

PROTEST: ‘ఉపాధి హామీ’కి గాంధీ పేరే ఉండాలి
A scene of protest in Gandhinagar Circle

సీపీఐ ఎంఎల్‌, బీఎస్పీ, పీడీఎస్‌యూ నాయకుల డిమాండ్‌

ధర్మవరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్‌, బహుజనసమాజ్‌ పార్టీ, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్‌ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్‌ జిల్లా నాయకుడు పోలా లక్ష్మీనారాయణ, బీఎస్పీ నియోజకవర్గ ఇనచార్జ్‌ వినయ్‌, పీడీఎ స్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజులనరేంద్ర మాట్లాడుతూ...


గ్రామీణ ఉ పాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆ పథ కాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలి తంగా అనాడు యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఉపా ధిహామీ చట్టం మౌలిక స్వభావాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మారు స్తోందన్నారు. కొత్తబిల్లు వల్ల ఉపాధి హామీ పథకం అమలులో కీలక మైన రాష్ట్రాల భాగస్వామ్యం నామమాత్రంగా మారుతుందన్నారు. మరో వైపు 10 నుంచి 40శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారన్నారు. ఈ ప థకం అమలుకు ఇప్పటివరకు కేంద్రం ఇస్తున్న 90శాతం నిధు లను 60శాతానికి తగ్గించి రాష్ట్రాలపై రూ. వేల కోట్లు అదనపు భారం వేస్తు న్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌పీ నాయకులు రాచర్ల నారాయణస్వామి, రమేశ, ఆర్‌ఎస్‌పీ కన్వీనర్‌ దాసరి నరసింహులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 22 , 2025 | 11:55 PM