PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:57 PM
బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ధర్మవరం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ... పలు ఇతర దేశాలలో హిందువులపై పైౖశా చికంగా ఉన్మాది చర్యలకు పాల్పడడం హేయమన్నారు. బంగ్లాదేశలో హిందూ యువకుడిని పెట్రోల్‌పోసీ తగలబెట్టడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని ఐక్యంగా ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన, విశ్వహిందూ పరిషత, ఏపీ యూడబ్ల్యూజే సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.