SPORTS: హాకీ విజేత కేహెచ డిగ్రీ కళాశాల జట్టు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:49 PM
ఎస్కే యూనివర్శిటీ అంతర్‌కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు.
హాకీ విజేత కేహెచ డిగ్రీ కళాశాల జట్టు
ధర్మవరం రూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎస్కే యూనివర్శిటీ అంతర్‌కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు. ధర్మవరం కేహెచ డిగ్రీకళాశాల విద్యార్థులు హాకీ క్రీడలో పాల్గొన్నారని, సెమీఫైనల్స్‌లో మంగళకర డిగ్రీ కళాశాల జట్టుతో తలపడి గెలిచా రన్నారు. ఫైనల్స్‌లో అనంతపురం ఆర్ట్స్ కళాశాల జట్టుతో తలపడి విజ యం సాధించారని కళాశాల పీడీ తెలిపారు. విజేత జట్టుసభ్యులు లోకేష్, బాల ఓబిలేసు, పవన, ధనుష్, ఓంశేఖర్, పోతిరెడ్డి, విశ్వనాథ్, ఆనంద్, శ్రవణ్‌కుమార్, హరిప్రకాష్, నారాయణ, మణిదీప్, మహేష్, ల క్ష్మన్న, రవీంద్ర, రఘు, యశ్వంతను మంగళ వారం ఆ కళాశాల ప్రిన్సి పాల్ ప్రభాకర్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గోపాల్‌నాయక్, చిట్టెమ్మ, కిరణ్‌కుమార్, పావని, భువనే శ్వరి, పుష్పవతి, మీనా, సరస్వతి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.