CPI: చెరువులను నీటితో నింపాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:02 AM
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.
సీపీఐ నాయకుల డిమాండ్
ధర్మవరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సీపీఐ రైతుసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య మాట్లాడుతూ... నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో ఉన్న 49 చెరువులను పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా నీటితో నింపేవారన్నారు. అయితే వాటిలోని బత్తల పల్లి నరహరికుంట చెరువుకు రెండేళ్ల నుంచి పీఏబీఆర్ కుడికాలువ ద్వా రా నీరు రావడంలేద న్నారు. ఈ చెరువుకు నీరు వస్తే బత్తలపల్లి ప ట్టణంలో తాగునీటి సమస్య ఉండదని, బత్తలపల్లి, గంటాపురం, నార్సిం పల్లి, గుమ్మల కుంట, ఆగ్రహారం, జల్ల నారాయణపల్లి, తాడిమర్రి, పుల్లపల్లిల్లో వ్యవసాయ బోరుబావులలో భూగర్భజలాలు పెరుగుతాయ న్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భూగర్భజలమట్టం తగ్గిందన్నారు. ఈ ధర్నాలో సీపీఐ, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, శ్రీనివాసులు, వెంకటస్వామి, వెంకటనారాయణ, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్, ఆదినారాయణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.