Share News

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:18 PM

గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్‌ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ
DSP Hemanthakumar talking to the villagers

బత్తలపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్‌ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు. అనవసరంగా క్షణికావేశంలో గొడవలు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వాహనాలు నడిపే వారు అజాగ్రత్తగా వ్యవహరించినా, హెల్మెట్‌, సీట్‌ బెల్టు వేసుకో కుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ సోమశేఖర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 25 , 2025 | 11:19 PM