Home » Dharmavaram
రాష్ట్రంలో మార్పు చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విగ్రహాలు ఉండాలంటే... అవి కేవలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, టీడీపీ వ్యవ స్థాపకులు ఎన్టీ రా మారావుకే చెల్లు అన్నారు.
మండలంలోని గొ ట్లూరు, పోతుకుంట, రేగాటిపల్లి చెరువులు హాంద్రీనీవా నీటితో నిం డి మరువ పోతున్నాయి. నెల రోజుల క్రితం నుంచి చెరువులకు నీరు చేరుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి మరువ పారు తున్నాయి. దీంతో ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాల ను భావి తరాలకు అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానం లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన సతీసమే తంగా పాల్గొన్నారు.
మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తండాలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారెమ్మ్ల జాతరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొ న్నారు.
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో వెల సిన మారెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మూ లవిరాట్లను ఆలయ పూజారి ఆకుపూజ, వేపమండలు, నిమ్మకాయలతో, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి పూజలు చేశారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 115మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు చిలకం మధుసూదనరెడ్డి ఆయన సతీమణి ఛాయాదేవి నగదు బహుమతులు అందజేశారు.
పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్‌ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు.
డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు ధర్మవరం టూటౌన పోలీసులు చెక్ పెడుతున్నారు. టూటౌన పరిధి లోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన, కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతాలలో ప్రయాణికులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో సంచరి స్తుంటారు. వారిని కామెంట్ చేసే వారిని, అసభ్యంగా ప్రవర్తించే వా రిని పోలీసులు డ్రోన ద్వారా పసిగడుతున్నారు.
మండలపరిధిలోని ధర్మ పురి నుంచి చిన్నూరు బత్తలపల్లికి వెళ్లే రహదారి మట్టిరోడ్డు కావడంతో కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు.
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతిబాటిల్‌ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్‌శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.