GOD: మారెమ్మకు పల్లకి సేవ
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:08 AM
మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తండాలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారెమ్మ్ల జాతరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొ న్నారు.
ముదిగుబ్బ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తండాలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారెమ్మ్ల జాతరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ ప్రజలు సంప్ర దాయాలను, ఆచారాలను పరిరక్షిస్తూ తరతరాలుగా కొనసాగిస్తున్న జాతరలు మన సంస్కృతికి ప్రతీకలన్నారు. స్థానిక ప్రజాప్రతిని ధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు మహిళలు పాల్గొన్నారు.
మంత్రికి వినతి: స్థానిక కస్తూర్బా కాలనీలో నివాసాలున్న ఇళ్లకు డోర్ నెంబర్లు లేవని ఆ కాలనీ వాసులు సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందించారు. అలాగే కాలనీలో సీసీ రోడ్లు, వీధి లైట్లు, చౌక ధాన్యపు డిపో ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....