POLICE: డ్రోన్లతో ఆకతాయిలకు చెక్
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:13 PM
డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు ధర్మవరం టూటౌన పోలీసులు చెక్ పెడుతున్నారు. టూటౌన పరిధి లోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన, కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతాలలో ప్రయాణికులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో సంచరి స్తుంటారు. వారిని కామెంట్ చేసే వారిని, అసభ్యంగా ప్రవర్తించే వా రిని పోలీసులు డ్రోన ద్వారా పసిగడుతున్నారు.
ధర్మవరం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు ధర్మవరం టూటౌన పోలీసులు చెక్ పెడుతున్నారు. టూటౌన పరిధి లోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన, కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతాలలో ప్రయాణికులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో సంచరి స్తుంటారు. వారిని కామెంట్ చేసే వారిని, అసభ్యంగా ప్రవర్తించే వా రిని పోలీసులు డ్రోన ద్వారా పసిగడుతున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన చుట్టు పక్కల ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిత్యం రద్దీ గా ఉండే కొత్తపేట సర్కిల్‌లో డ్రోన కెమెరాను ఉప యోగించి ఆక తాయిలను గుర్తించి వారికి పోలీసు మార్క్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
టెక్నాజీని ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించే పనిలోప డ్డారు. జూదాలు ఆడేవారిని, గంజాయి విక్రయించే వారిని, విద్యార్థినిలను కామెంట్ చేసేవారిని కూడా గుర్తించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాలలో డ్రోన ఎగరేస్తారు. గంట పాటు అంతా గమనిస్తారు. పోలీసులు అనుమానం వచ్చిన వ్యక్తులను పట్టుకుని కౌన్సెలింగ్ ఇస్తారు.
ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం- రెడ్డప్ప, టూటౌన సీఐ, ధర్మవరం
టూటౌన పరిధిలోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన చుట్టు పక్కల ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలతో పాటు అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తున్న సంఘటన లు మా దృష్టికి వస్తున్నాయి. అదేవిధంగా మద్యం తాగి అనవసరంగా గొడవలకు దిగుతున్నట్టు కూడా సమాచారం వస్తోంది. ఇలాంటివి జరగకుండా డ్రోన్ల ద్వారా ఆకతా యిలను గుర్తిస్తున్నాం. ముఖ్యంగా రైల్వేస్టేషన ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలను కూడా డ్రోన్ల ద్వారా గుర్తించి ఎస్పీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....