GOD: మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:58 PM
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో వెల సిన మారెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మూ లవిరాట్లను ఆలయ పూజారి ఆకుపూజ, వేపమండలు, నిమ్మకాయలతో, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి పూజలు చేశారు.
ధర్మవరం రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలం లోని చిగిచెర్ల గ్రామంలో వెల సిన మారెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మూ లవిరాట్లను ఆలయ పూజారి ఆకుపూజ, వేపమండలు, నిమ్మకాయలతో, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి పూజలు చేశారు. గ్రామస్థులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి వేళాల్లో భజన, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....