ROAD: ఈ రహదారిలో ప్రయాణం నరకం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:36 PM
మండలపరిధిలోని ధర్మ పురి నుంచి చిన్నూరు బత్తలపల్లికి వెళ్లే రహదారి మట్టిరోడ్డు కావడంతో కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు.
కోతకు గురై ఆధ్వానంగా మట్టిరోడ్డు
ధర్మవరం రూరల్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని ధర్మ పురి నుంచి చిన్నూరు బత్తలపల్లికి వెళ్లే రహదారి మట్టిరోడ్డు కావడంతో కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటికే రోడ్డు కోతకు గురైన ప్రదేశంలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాలపాలైయ్యారని ఆయా గ్రా మస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతు న్నాయని, రహదారి నిర్మాణం చేపట్టాలని, కోతకు గురైన ప్రదేశంలో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టిం చుకోవడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ మట్టిరోడ్డులోనే ప్రయాణం చేస్తున్నామని, చాలా ఇబ్బందికరంగా ఉం దని వాపోతున్నారు. రాత్రివేళ భయంభయంగా ప్రయాణం చే యాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన రోడ్డు మంజూరు చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....