RANGOLI: ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:46 PM
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 115మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు చిలకం మధుసూదనరెడ్డి ఆయన సతీమణి ఛాయాదేవి నగదు బహుమతులు అందజేశారు.
ధర్మవరం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 115మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు చిలకం మధుసూదనరెడ్డి ఆయన సతీమణి ఛాయాదేవి నగదు బహుమతులు అందజేశారు. ప్ర థమ బహుమతిని పద్మావతికి రూ.10,016, ద్వితీయ బహుమతి ప్రస న్నలక్ష్మికి రూ.5016, తృతీయ బహుమతిని సాయిసుష్మ, సాయికీర్తికి రూ.2016 చొప్పున అందజేశారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కి ప్రత్యేక బహుమతులు అందజేశారు.
నాయకులు బెస్తశ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్, సరితాల బాషా తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట: మండల పరిధిలోని కత్తివారిపల్లి పంచాయతీలో మంగళవారం ఏకల్ అభియాన పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామస్థుడు ప్రసాద్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు దొడ్డెప్ప, లక్ష్మీదేవి, ప్రమీలమ్మ, గంగయ్య, రమణారెడ్డి, మల్లికార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రథమ బహుమతి పొందిన యువతికి సన్మానం
బుక్కపట్నం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో సోమవారం బిల్డర్ సాయి రమేష్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 500 మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. విజేతలను సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ఎంపికచేశారు. అనంతరం ముగ్గుల పోటీల నిర్వాహకులు సాయి రమేష్ ప్రథమ విజేతగా నిలిచిన బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లికి చెందిన ఇందిర ఇంటి వద్దకు వెళ్లి రూ. లక్ష చెక్‌ను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆ యువతి ని గ్రామంలో ఊరేగించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....