Home » Dharmavaram
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో సోమవారం గ్రంథాలయ అఽధికారి అంజలిసౌభాగ్యవతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కవి ప్రపుల్లా చంద్ర, వెంకటేశులు, టీటీడీ ధర్మచారులు కకాకుమాను, రవీంద్ర, గాయకులు నాగరాజులను శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రంఽథాలయాల గురించి పద్యం, కవిత, పాటల ద్వారా వారు విద్యార్థులకు వివరించారు.
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు.
ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్‌నాయక్ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాదించడంతో బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ బాణాసంచా కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు.
మండలంలోని ఏకపాదంపల్లిలో శుక్రవారం సాయంత్రం నారసింహ నామం మార్మోగింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉదయం నుం చి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజ లు, అన్నదానం నిర్వహించారు. సాయం త్రం 6గంటలకు ఆ కాశదీపం వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పురోహితుడు అశోక్ శర్మ ప్రారంభించారు.
పట్టణంలోని శాంతి నగర్ మున్సిప ల్ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చ దువుతున్న శంకరపు గణేశ రాష్ట్రస్థాయి సైన్స సెమినార్‌లో ప్రతిభ కనబరచారని ఆ పాఠశాల హెచఎం ఉమాపతి, సైన్స ఉపాధ్యాయులు ఎస్‌బీ రేఖ, ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి గణేశను గురువారం పాఠశాల లో వారు అభినందించారు.
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‌పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
తమకు రావాల్సిన ఇంక్రిమెం ట్లు, అరియర్స్, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపాలిటీ పరి ధిలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డిమాండ్ చేశారు. ఐదు నెలల ఇంక్రిమెంట్లతో పాటు అరియర్స్, మెడికల్ బిల్లుల మంజూరులో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ మంగళవారం ముస్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో ధర్మవరం విద్యార్థిని సింధు ప్రతిభ కనబరచి జా తీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం సుమన తెలిపారు. ఇటీవల అనంత పురం సమీపంలోని మాంటి స్సోరి పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో తమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సింధు పాల్గొన్నారు.