GOD: భావనా రుషి కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:56 PM
భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణ మహోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణం లోని పద్మశాలీయ బహూమత్తమ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 6గంటలకు గోపూజ, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విగ్వరణం, కార్యకర్తలకు కంకణదారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్షాహోమం, మహాగణపతి హోమం చేశారు.
ధర్మవరం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణ మహోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణం లోని పద్మశాలీయ బహూమత్తమ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 6గంటలకు గోపూజ, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విగ్వరణం, కార్యకర్తలకు కంకణదారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్షాహోమం, మహాగణపతి హోమం చేశారు. అనంతరం భద్రావతి భావనా రుషీం ద్రులకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9గంటలకు బిందెసేవ(గంగపూజ) నిర్వహించ, స్వా మివారికి పంచామృతాభిషేకం, అంకురార్పణ, లక్ష్మీనారాయణహోమం చేపట్టారు. సాయంత్రం ధ్వజారోహణ చేశారు. బుధవారం ఉదయం భ ద్రావతి భవనా రుషీంద్రుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వ హిస్తామని ఆ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు పుత్తా రుద్రయ్య, జింకా నాగభూషణ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సంఘం సభ్యులు పద్మశాలీయ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....