NMU: సర్క్యులర్ 1/19ను వెంటనే అమలు చేయాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:56 PM
ఉద్యోగభద్రత సర్క్యులర్ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్ చైర్మన ముత్యాలప్ప, జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగశేఖర్ తెలిపారు. ఈ మేరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు.
ఎనఎంయూ నాయకులు ఫ రిలే దీక్షలు
ధర్మవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగభద్రత సర్క్యులర్ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్ చైర్మన ముత్యాలప్ప, జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగశేఖర్ తెలిపారు. ఈ మేరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు. వారికి మద్దతుగా గురువా రం స్థానిక డిపో ఆవరణంలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష ల్లో ఎనఎంయూ నాయకులు బీఎం గోపాల్, బత్తినన్న, రమణప్ప, గోపాల్, కదిరప్ప, బి.గోపాల్, అశోక్, మంజునాథ్, శేషు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప డీపీటీఓ సిబ్బందిపై అమలు చేస్తున్న కక్షసాధింపు చర్యలలో వాస్తవాలను పరిశీలించాలన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యమ తీవ్రతను పెంచుతామన్నారు. కడప జోనలో ఉన్న అన్ని డిపోలలో ఉద్యోగభద్రత సర్కులర్ 1/19ను వెంటనే అమలుచేయాలని, జోనలో అన్ని కేటగిరిల్లో ఖాళీలను ప్రమోషన్స ద్వారా భర్తీ చేయాలని, అర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశాన్నారు. కార్యక్రమంలో ఎనఎంయూ డిపో కార్యదర్శి మధుసూదన, డిపో చైర్మన హనుమాన, గ్యారేజ్ అధ్యక్షులు ప్రసాద్, గ్యారేజ్‌కార్యదర్శి హరిక్రిష్ణ, డిపో కోశాధికారి వైవీఎన రెడ్డి, డిపో సీనియర్ నాయకులు పీఎస్ ఖాన, సీఈసీఎస్ డెలిగేట్ జేఎస్ రాయుడు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....