HONESTY: నిజాయతీని చాటుకున్న ఆటో డ్రైవర్
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:03 AM
పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్‌బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది.
ధర్మవరం, జనవరి 27(ఆంద్రజ్యోతి): పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్‌బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది. అయితే అనసూయమ్మ ఆటోలోనే మరిచిపోయిన రెండు మొబైల్ ఫోన్లు, రూ.10వేల నగదును కొద్దిసేపటికే గమనించిన శేఖర్ వెంటనే ఆ మె ఇంటి వద్దకు వెళ్లాడు. అంతలోనే ఆమె టీడీపీ పట్టణ అధ్యక్షు డు పరిశే సుధాకర్‌ను సంప్రదించి వనటౌన పోలీసు స్టేషనకు వెళ్లి సీఐ నాగేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలోనే ఆటో డ్రైవర్ స్టేషనకు వెళ్లాడు. అక్కడ ఆమె ఉండటంతో మొబైల్ ఫోన్లు, రూ.10వేల నగదును సీఐ సమక్షంలో అందజేశారు. దీంతో ఆటో డ్రైవర్ నిజాయతీని చూసి వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశేసుధాకర్, బాధితురాలు అనసూయమ్మ శేఖర్‌కు శాలవా కప్పి అభినందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....