Home » Dharmavaram
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సి పల్ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరికి విన్నవించారు. వారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశా రు.
గడ్డిమందు పిచికారి చేయడంతో మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ రెడ్డి మూడెకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ముంచిన గడ్డిమందు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన మండల వ్యవసా యాధికారి ముస్తఫా సిబ్బందితో కలిసి రైతుపొలాన్ని పరిశీలించారు.
వర్షపు నీటిని సద్వినియోగం చేసు కోవాలనే లక్ష్యంతో నిర్మిం చిన చెక్ డ్యాంలు ప్రస్తు తం నిరుపయోగంగా మా రాయి. వాటర్ షెడ్ ప థకం కింద ఉమ్మడి అనం తపురం జిల్లాలో ప్రధా న వాగులపై మొత్తం 3,326 చెక్ డ్యాములను, వంకల్లో 1600 చెక్ వాల్స్ నిర్మించారు. కొన్ని ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా, మరికొన్నింటిని ఆర్డీటీ నిధులతో కట్టించారు.
మండలంలోని ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. చిగిచెర్ల విద్యుత సబ్‌స్టేషన ముందుభాగంలో రోడ్డు మలుపువద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కని పించక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
వాల్మీకులను ఎస్టీ జాబి తాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమే అని టీడీపీ నియోజకవర్గ ఇన చా ర్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కోసం మండపం ని ర్మాణానికి ఆ యన మంగళవారం భూమిపూజ చేశారు.
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వస్వామి ఆలయంలో గరు డ పౌర్ణమి సేవా కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించా రు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ వా హనంపై స్వామివారిని ఆశీ నులు చేసి పురవీధుల్లో ఊ రేగించారు.
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గ మ్మ విగ్రహాన్ని శనివారం సంఘమేశ్వరం చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని స్వయంభూ కాలబైరవస్వామి ఆలయంలో దసరా ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం లో అమ్మవారి మూల వి రాట్‌కు శనివారం అర్చ కులు పుష్పాభిషేకాన్ని ఘ నంగా నిర్వహించారు. అ మ్మవారి మూల విరాట్ ను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం పుష్పాభిషేకాన్ని శాస్ర్తోక్తం గా నిర్వహించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్, ఏపీ సీడ్స్ కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్, పీఆర్‌టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మామిళ్ల కుంట కూడలిలోని లలితాంబ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చా రు. ఎనుమలపల్లి దుర్గామాత, ప్రశాంతినిలయంలో గాయత్రిమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, కోవెలగుట్టుపల్లి దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శమిచ్చారు.