ROAD: ప్రమాదకరంగా రోడ్డు మలుపు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:36 AM
మండలంలోని ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. చిగిచెర్ల విద్యుత సబ్‌స్టేషన ముందుభాగంలో రోడ్డు మలుపువద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కని పించక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ధర్మవరంరూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. చిగిచెర్ల విద్యుత సబ్‌స్టేషన ముందుభాగంలో రోడ్డు మలుపువద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కని పించక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు. ప్రధానంగా ఎటువంటి సూచిక బోర్డులుగానీ, రక్షణ కవచంగా డివైడర్లు లేక పోవడంతో మలుపు వద్ద ద్విచక్రవాహనాలు అదుపుకాక కిందపడి పలువురు మృత్యువాతపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మలుపు వద్ద కంపచెట్లు తొలగించి, మలుపు కనిపించేలా సూచిక బోర్డులు, డివైడర్లను ఏర్పాటుచేయాలని వాహనదారులు కోరుతున్నారు.