WATER: వాగు దాటాల్సిందే..!
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:04 AM
మండల పరిధిలోని ధర్మపురి గ్రామం నుంచి చిన్నూరుబ త్తలపల్లికి వెళ్లాలంటే ఆ గ్రామప్రజలు వాగుదాటాల్సిందే. ఆ రెండు గ్రామాలకు మధ్యలో వాగు ఉంది. సమీప చెరువు చెలిమి నీటితో ఆ వాగు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అంతేగాకుండా వర్షాలు కురిస్తే ఆ వాగులో భారీగా నీరు చేరి ఆ రెండు గ్రామాలకు రాకపోక లు నిలిచిపోతాయి.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి)
మండల పరిధిలోని ధర్మపురి గ్రామం నుంచి చిన్నూరుబ త్తలపల్లికి వెళ్లాలంటే ఆ గ్రామప్రజలు వాగుదాటాల్సిందే. ఆ రెండు గ్రామాలకు మధ్యలో వాగు ఉంది. సమీప చెరువు చెలిమి నీటితో ఆ వాగు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అంతేగాకుండా వర్షాలు కురిస్తే ఆ వాగులో భారీగా నీరు చేరి ఆ రెండు గ్రామాలకు రాకపోక లు నిలిచిపోతాయి. వాగులో సిమెంట్ పైపులు వేసి, రహదారి ఏర్పా టుచేస్తే తప్ప రాకపోక లకు అంతరాయం కలుగకుండా ఉండదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వారు వాపోతు న్నారు. మామూలుగా చిన్నూరుబత్తలపల్లి నుంచి ధర్మపురి మీదుగా ధర్మవరం వెళుతుంటారు. అయితే ఆ వాగు పారితే రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామస్థులు తెలుపుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.