Share News

TD P: అర్హులందరికీ భరోసా పింఛన్లు

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:09 AM

ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్‌, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌, పీఆర్‌టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్‌ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.

TD P: అర్హులందరికీ భరోసా పింఛన్లు

ధర్మవరం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్‌, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌, పీఆర్‌టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్‌ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అటువంటి రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అబివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిపిందని అన్నారు. అయితే వైసీపీ నాయకులు సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు కావడంలేదని వారి రోతపత్రికలో గగ్గోలు పెడు తున్నారని అన్నారు. అదేవిధంగా 25వ వార్డులో వార్డు ఇనచార్జ్‌ భీమనేని ప్రసాద్‌నాయుడు, వార్డు కమిటీ ఉపాధ్యక్షుడు చీమల రామాంజి, కొత్తపేటలో టీడీపీ నాయకులు కొత్తపేట ఆది తదితరులు పింఛన్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుఽధాకర్‌, మదీనామసీదు కమిటీ అధ్యక్షుడు నాగూర్‌హుస్సేన, నాయకులు రామకృష్ణ, ఈశ్వరయ్య, బీరే శీన, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 12:09 AM