MINISTER: కార్మికుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:01 AM
మున్సిపల్ కార్మికుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్‌యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో వైదేహి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో మున్సి పల్ కార్మికుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్మికుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్‌యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో వైదేహి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో మున్సి పల్ కార్మికుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్యశిబిరంలో మంత్రితోపాటు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మున్సిపల్‌కార్మికులు తరచూ శారీరక శ్రమతో పాటు ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తా రని, కావున వారిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంద న్నారు. అందుకే ఈ వైద్యశిబిరం ఏర్పాటుచేశామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 48లక్షల మంది ఉచితంగా పరీక్షలు చేయించుకు న్నారన్నారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఇప్పటికే కోటి నలబై లక్షల కుటుంబా లకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారన్నారు. దాదాపు రూ.25లక్షల ఖరీదైన చికిత్సలు కూడా ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో కార్మికులకు క్యాన్సర్, రక్తపోటు, షుగర్, న్యూరో, ఈఎనటీ వంటి వాటికి పరీక్షలు వైద్యులు నిర్వహించారు.