GOD: దుర్గమ్మ నిమజ్జనం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:52 AM
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గ మ్మ విగ్రహాన్ని శనివారం సంఘమేశ్వరం చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని స్వయంభూ కాలబైరవస్వామి ఆలయంలో దసరా ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు.
ధర్మవరం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గ మ్మ విగ్రహాన్ని శనివారం సంఘమేశ్వరం చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని స్వయంభూ కాలబైరవస్వామి ఆలయంలో దసరా ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో పూజారి ధనుంజయ ఆచారి దుర్గమ్మ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, 11 రోజుల పాటు విశేష పూజ లు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని శనివారం ఊరేగింపుగా సంఘమేశ్వర చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించి నిమజ్జనంచేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....