Home » Dharmavaram
మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్‌కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరి టాలశ్రీరామ్ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు.
మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు.
శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే మా పొలాల్లోనే దహనసంస్కారాలు చేస్తున్నామని, శ్మశానవాటికకు స్థలం కేటాయించి తమ సమస్యను పరి ష్కారించాలని మండలంలోని నేలకోట గ్రామ ఎస్సీకాలనీ వాసులు బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌కు విన్నవిం చారు.
రిథమిక్ యోగాసన పెయిర్ సబ్ జూనియర్స్ విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో మండల కేంద్రం లోని శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ... యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన ఆఫ్ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అ నంతపురం పీవీకేకే ఇనస్టిట్యూట్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరిగా యని తెలిపారు.
పట్ట ణంలోని శాంతినగర్‌లో వె లసిన అయ్యప్పసామికి లక్ష పుష్పార్చనను సోమ వారం గురుస్వామి పో లంకి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవా రుజామున గణపతి, సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, అ య్యప్పస్వామికి అభిషేకం చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యా యుల మానసిక ఉల్లాసం కోసమే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వ హించిందని ఽఎంఈఓ గోపాల్‌నాయక్ తెలిపారు. పట్టణంలోని తారక రామాపురం వద్ద ఉన్న ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డివిజనస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయ క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి.
మండలపరిధిలోని బిల్వంప ల్లిలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామానికి చెంది న టీడీపీ నాయకుడు బాల ఓబిలేసు పుష్పగుచ్ఛం అందజేసి, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్ర జలు పలు సమస్యలను ఆయన దృష్టికి తె చ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా త మ పింఛన్లు తొలగించారని, వాటిని పున రుద్దరించాలని పలువురు కోరారు.
మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురు గునీటి కాలువల్లో నీరు పారలేక రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా దుర్వాస వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులపై పారుతున్న మురుగునీటిలో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆయా గ్రామస్థులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
రాజీమార్గంతోనే జీవితం సుఖమయంగా ఉంటుందని న్యాయాధికారు లు పేర్కొన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి కోర్టులలో శనివారం న్యా యాధికారుల ఆధ్వర్యంలో జాతీయ మెగాలోక్ అదాలత కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మవరం కోర్టులో సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూని యర్ సివిల్ కోర్టు న్యాయాధికారి పీడీఎం నందిని పాల్గొన్నారు.