GOD : ఘనంగా వీరనారాయణస్వామికి పూజలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:02 AM
మండల పరిధి లోని అప్రాచెరువు గ్రామంలో వెలసిన వీరనారాయణస్వామికి గ్రామస్థుల ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మూడు రో జుల పాటు వీరనారాయణ స్వా మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు. అందులో భాగంగా ఆ దివారం ఎలవ గంపను ఊరేగిం చారు
బత్తలపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల పరిధి లోని అప్రాచెరువు గ్రామంలో వెలసిన వీరనారాయణస్వామికి గ్రామస్థుల ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మూడు రో జుల పాటు వీరనారాయణ స్వా మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు. అందులో భాగంగా ఆ దివారం ఎలవ గంపను ఊరేగిం చారు. సోమవారం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను చిత్రావతి నది వద్దకు తీసుకెళ్లి ఆలయ అర్చకులు వీరనారప్ప ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి గ్రామోత్సవం అనంతరం అన్నదానం చేపట్టారు.