CITU: దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:09 AM
లేబర్ కోడ్‌లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్‌ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్‌సర్కిల్, ఆర్డీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
సీఐటీయూ నాయకులు - పట్టణంలో బైక్ ర్యాలీ
ధర్మవరం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): లేబర్ కోడ్‌లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్‌ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్‌సర్కిల్, ఆర్డీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి అంజుమన సర్కిల్ మీదుగా సీఐటీయూ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... కార్మికుల హక్కులను కాపాడే చట్టాలను రద్దు చేసి, కార్మికుల హక్కులను అణచివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టేవిధంగా వీబీజీరాంజీ పేరుతో తెచ్చిన కొత్తచట్టాన్ని రద్దుచేసి, పాత చట్టాని అమలు చేయాలన్నారు. ఈ మేరకు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇచ్చి, విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ ర్యాలీలో సీఐటీయూ నాయకులు జేవీరమణ, ఎల్ ఆదినా రాయణ, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్‌హెచబాషా, ఖాదర్ బాషా, గుంపుహరి, రైతుసంఘం మండల కార్యదర్శి శేషంపల్లి మారుతి, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....