Home » Dharmavaram
పంచాయతీ రాజ్ ఉద్యోగుల యూనియన ధర్మవరం తాలుకా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ యూనియన జిల్లా నాయకులు విజయ శేఖర్ నాయుడు, శ్రీని వాసుల తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో ఆదివారం ఆ యూనియన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్న ట్లు తెలిపారు. తాలూకా అధ్యక్షుడిగా తాడిమర్రి ఎంపీడీఓ కార్యా లయం జూనియర్ అసిస్టెంటు అక్కిం ప్రతాప్‌ను ఎన్నుకున్నారు.
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని కల్గిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయం లో మంత్రి ఆదివారం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా త్వరలో ప్రారంభం కానున్న అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ టోర్నీ సీజన-2 టీషర్టులను ఆయన ఆవిష్కరించారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాదిన్నె ఆంజనేయస్వామి ఆల యంలో శ్రావణమా సం నాలుగో శనివారం ప్రత్యేక పూజలు ని ర్వహిం చారు. స్వామి ని దర్శించుకోవ డానికి ఉదయం నుంచే భక్తు లు క్యూ కట్టారు. తనక ల్లు, నల్లచెరువు మండ లాలకు చెందిన టీడీపీ నాయకులు రమణనా యుడు, కావడి ప్రవీణ్ కుహార్ అన్నదానం చేశారు.
కృష్ణాష్టమి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో జగన్నాథ, సుభద్ర, బల రామ ప్రతిమలను ఇస్కాన ధర్మవరం ధర్మప్రచారకులు శ్రీకృష్ణ మాధవ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు.
స్వాతంత్య్రదినోత్స వాలకు మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి జెండా రంగుల విద్యుత దీపా లు వేయించడంతో జెండా పండుగ శోభ సంతరించుకుంది.
కడపజిల్లా పులివెం దుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంపై తెలుగుతమ్ముళ్లు సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హనుమాన కూడలిల లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచాకాల్చి మిఠా యిలు తినిపించుకున్నారు.
పట్టణంలోని కాకతీయ, యశోద, రిషి పాఠశాలల్లో, మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముం దస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, కుచేలు డు వేషధారణలో అలరించారు.
స్వమిత్వ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధర్మవ రం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి జనార్ధనరావు సూచించారు. స్వమి త్వ పథకంలో భాగంగా మండలంలోని పోతులనాగేపల్లిలో క్షేత్రస్థాయి లో జరుగుతున్న సర్వేను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల సర్వే పూర్తిచేశారు? తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మహమ్మదాబాద్ మిషన కార్యాలయం ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగల్‌విండో అధ్యక్షుడిగా జనసేన నాయకుడు కమ్మల నరేష్, డైరెక్టర్లుగా చంద్రశేఖర్, నరసింహులు ప్రమాణ స్వీకరానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెం డో రోజు బుధవారం కొనసాగింది. డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎనఎంయూ జిల్లా నాయకులు మోహన, దుర్గాప్రసాద్, నాగప్పమాట్లాడుతూ... ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే పీఆర్‌సీ కమిషనను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు.