BANANA: దిగుబడి నేలపాలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:14 AM
మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు తాడిమర్రి చెన్నారెడ్డి సాగుచేసిన అరటిచెట్లు గాలివానకు నేలకొరిగి రైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. రైతు చెన్నారెడ్డి మాట్లాడుతూ... తన మూడెకరాల్లో సుమారు 3వేలకు పైగా అరటిచెట్లు సాగుచేశానన్నారు. పది నెలలుగా కంటిరెప్పలా రేయింబవళ్లు శ్రమించి తెగుళ్లు రాకుండా చెట్లను కాపాడానన్నారు.
-గాలివానకు నేలకొరిగిన అరటి చెట్లు
ధర్మవరంరూరల్, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు తాడిమర్రి చెన్నారెడ్డి సాగుచేసిన అరటిచెట్లు గాలివానకు నేలకొరిగి రైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. రైతు చెన్నారెడ్డి మాట్లాడుతూ... తన మూడెకరాల్లో సుమారు 3వేలకు పైగా అరటిచెట్లు సాగుచేశానన్నారు. పది నెలలుగా కంటిరెప్పలా రేయింబవళ్లు శ్రమించి తెగుళ్లు రాకుండా చెట్లను కాపాడానన్నారు. ఇప్పటికి సుమారు రూ. 5లక్ష ల వరకు పెట్టుబడి పెట్టానని తెలిపారు. మరో వారానికి దిగుబడి వచ్చే స మయంలో రెండురోజులుగా కురిసిన గాలివానకు సుమారు 150చెట్లు నేలకొరిగాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సుమారు మూడు టన్నుల కాయల వరకు నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నారు. రూ. లక్షలకు లక్షలు అప్పులు చేసి పంటలు సాగుచేస్తే, తీరా పంటదిగుబడి సమయంలో ప్రకృతివైపరీత్యాలతో నష్టపోతున్నామని రైతు తెలిపాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరాడు.