CROP: దెబ్బతిన్న వేరుశనగ పంట పరిశీలన
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:49 PM
గడ్డిమందు పిచికారి చేయడంతో మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ రెడ్డి మూడెకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ముంచిన గడ్డిమందు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన మండల వ్యవసా యాధికారి ముస్తఫా సిబ్బందితో కలిసి రైతుపొలాన్ని పరిశీలించారు.
- మొక్కజొన్నలో వాడే గడ్డి మందు పిచికారి వల్లే : ఏఓ
ధర్మవరం రూరల్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గడ్డిమందు పిచికారి చేయడంతో మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ రెడ్డి మూడెకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ముంచిన గడ్డిమందు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన మండల వ్యవసా యాధికారి ముస్తఫా సిబ్బందితో కలిసి రైతుపొలాన్ని పరిశీలించారు. రైతుపిచికారి చేసిన మందు అట్రాజైనగా గుర్తించారు. ఈ మందును మొక్కజొన్న పంటకు మాత్రమే పిచికారి చేయాలన్నారు. ఇటువంటి మం దుల పిచికారి వల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఏఓ తెలిపారు.
పంటలలో గడ్డి మందులు పిచికారి చేసేటప్పుడు తప్పనిసరిగా వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరైనా గ్రామాలకు వచ్చి రసాయనిక మందులు అమ్మకాలు జరిపితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మందు కోనుగోలు చేసినట్లు రసీదులు లేవని రైతు తెలుపగా, రసాయనిక మందులు కోనుగోలు చేస్తే తప్పకుండా రసీదులు పొందాలని సూచించారు. రైతుకు జరిగిన నష్టంపై ఉన్నతాధికా రులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఏఓ వెంట జడ్పీ మాజీచైర్మన ఓబిరెడ్డి, రాఘవరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....