POTHOLES: గుంతల రోడ్డుతో ఇబ్బందులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:27 PM
పట్టణ సమీపంలోని పుట్టపర్తికి వెళ్లే రహదారిలో తుంపర్తికాలనీ వద్ద రోడ్డుపై పడిన గుంతలతో వాహన దారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మోటుమర్ల వద్ద నుంచి తుంపర్తి కాలనీ వరకు ఈ రోడ్డు గుంతలుపడి అధ్వానంగా తయారైంది.
ధర్మవరం, అక్టోబరు 12(ఆంఽధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని పుట్టపర్తికి వెళ్లే రహదారిలో తుంపర్తికాలనీ వద్ద రోడ్డుపై పడిన గుంతలతో వాహన దారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మోటుమర్ల వద్ద నుంచి తుంపర్తి కాలనీ వరకు ఈ రోడ్డు గుంతలుపడి అధ్వానంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడేవారు. రాత్రి సమయాల్లో ఆ గుంతలను గమనించక పలువురు వాహనదారులు కిందకు పడి తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక రోడ్డుపై పడిన గుంతలను పూడ్చివేశారు. కానీ ఇటీవల రోడ్డుపై కంకర తేలి మళ్లీ గుంతల మయంగా మా రింది. వాహనదారు లకు సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. వర్షాకాలంలో రోడ్డుపై పడిన గుంతల లో నీరు చేరడంతో ఆ గుంతల్లో నీరు ఉందన్న విషయం తెలియక ముందుకు వెళ్లడంతో వాహనాలు అదుపుతప్పి చాలా మంది కిందకు పడి గాయాలపాలయ్యారు. ఈ రెండు వెంటే నిత్యం ప్రజాప్రతినిధులు, వీఐపీలు జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. వారికి ఈ గుంతల మయమైన రోడ్డు ఒక్కసారైనా కనిపించలేదా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతల మయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....