CPI: ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:22 AM
నియోజకవర్గంలో ట్రాక్టర్ కార్మికు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మసుగుమధు డిమాండ్‌చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక గాందీనగర్ సర్కిల్ నుంచి సీపీఐ ఆధ్వ ర్యంలో ట్రాక్టర్ కార్మికులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
ధర్మవరం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ట్రాక్టర్ కార్మికు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మసుగుమధు డిమాండ్‌చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక గాందీనగర్ సర్కిల్ నుంచి సీపీఐ ఆధ్వ ర్యంలో ట్రాక్టర్ కార్మికులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ నిరసనలో మధు మాట్లాడుతూ...గతంలో ఇసుక, మట్టిని ప్రభుత్వమే అందించడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తోందని, అయితే సొంత ఇ ళ్లు, గుడి నిర్మాణాలకు ఇసుక తరలించే ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేస్తు న్నారన్నారు. ఈ ప్రాంత నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించే టిప్ప ర్లపై చర్యలుతీసుకోవాలని డిమాండ్‌చేశారు. అనంతరం ట్రాక్టర్ కార్మికుల సమస్యలపై ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సీపీఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శులు ఎర్రంశెట్టి రమణ, శ్రీనివాసులు, రైతుసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, చేనేత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి వెంకటరమణ, గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, ఆదినారాయణ, మహిళా సమాఖ్య లీడర్లు లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, ట్రాక్టర్ కార్మికులు పాల్గొన్నారు.