CHECK DAM: చెక్ డ్యాంల నిర్వహణ అస్తవ్యస్తం
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:31 PM
వర్షపు నీటిని సద్వినియోగం చేసు కోవాలనే లక్ష్యంతో నిర్మిం చిన చెక్ డ్యాంలు ప్రస్తు తం నిరుపయోగంగా మా రాయి. వాటర్ షెడ్ ప థకం కింద ఉమ్మడి అనం తపురం జిల్లాలో ప్రధా న వాగులపై మొత్తం 3,326 చెక్ డ్యాములను, వంకల్లో 1600 చెక్ వాల్స్ నిర్మించారు. కొన్ని ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా, మరికొన్నింటిని ఆర్డీటీ నిధులతో కట్టించారు.
- వృథాగా పోతున్న వర్షపు నీరు
- గత వైసీపీ పాలనలో పట్టించుకోని పరిస్థితి
- ప్రస్తుత ప్రభుత్వంపై రైతుల ఆశలు
ముదిగుబ్బ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీటిని సద్వినియోగం చేసు కోవాలనే లక్ష్యంతో నిర్మిం చిన చెక్ డ్యాంలు ప్రస్తు తం నిరుపయోగంగా మా రాయి. వాటర్ షెడ్ ప థకం కింద ఉమ్మడి అనం తపురం జిల్లాలో ప్రధా న వాగులపై మొత్తం 3,326 చెక్ డ్యాములను, వంకల్లో 1600 చెక్ వాల్స్ నిర్మించారు. కొన్ని ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా, మరికొన్నింటిని ఆర్డీటీ నిధులతో కట్టించారు. ఒక చెక్ వాల్ నిర్మాణానికి రూ. లక్ష నుంచి రూ. 2లక్షలు, చెక్ డ్యాం నిర్మాణానికి రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షలు చొప్పున రూ. కోట్లు ఖర్చు చే శారు. ఐదేళ్ల పాటు నిర్వహణ బాగానే ఉన్నా... వాటి కాల పరిమితి తీరిపో వడంతో దిమ్మెలు నెర్రెలు చీలుతున్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకోగా, వరదలు వచ్చినప్పుడు మరికొన్ని పూర్తిగా కొట్టుకు పోయాయి. ఫలితంగా వాగుల్లో, వంకల్లో వచ్చే వర్షపు నీరంతా దిగువకు వృథాగా పోతోంది.
పూడిక, కంప చెట్లతో నిండిన వైనం
చెక్ డ్యాంలు నిర్మించిన ఐదేళ్ల పాటు ఏటా పూడికతీత చేపట్టారు. 2019 తరువాత చెక్ డ్యాంల మరమ్మతులపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో శిథిలావస్థకు చేరాయి. గండ్లు పడి, బీటలు వారి చాలా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఏమాత్రం నిల్వ లేకుం డా వృఽథాగా పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత, మరమ్మతులు చేపట్టేవారు.
ప్రస్తుతం అధికారులు పట్చించుకోకపోవడంతో మట్టితో పేరుకుపోయి, కంపచెట్లు పెరిగి నిరుపయోగంగా మారాయి.
- ముదిగుబ్బ మండలంలోని సంకేపల్లి, బ్రాహ్మణపల్లి వద్ద ఐదేళ్ల కిందట రూ. 5 లక్షలతో నిర్మించిన చెక్ డ్యాం రెండేళ్ల కిందట కురిసిన అధిక వర్షాలకు కొట్టుకుపోయింది.
- రాళ్ల అనంతపురం వద్ద నిర్మించిన చెక్ డ్యాంకు గండ్లు పడటంతో నీరు నిల్వ లేకుండా ఒట్టిపోయింది. గతేడాది కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతంలోని మట్టి కొట్టుకొచ్చి చెక్‌డ్యాం పూడిపో యింది. మట్టిపై కంపచెట్లు పెరిగి ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
- మండల కేంద్రంలోని పాతూరు సమీపంలో నిర్మించిన చెక్ డ్యాం నిర్వహణ లేక పోవడం తో కంపచెట్లతో మూసుకుపోయి నిరుపయోగంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వమైనా చెక్ డ్యాంల కు మరమ్మతులు చేయించి వ్యవసాయానికి అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
నివేదికలు పంపుతాం-శ్రీలక్ష్మి, డ్వామా ఇనచార్జ్ పీడీ
శిథిలమైన చెక్ డ్యాంలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాము. ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేస్తే దెబ్బతిన్న, నెర్రెలు ఇచ్చిన చెక్ డ్యాంల మరమ్మతుల పనులు చేపడుతాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....