LAWYERS: కర్నూల్‌లో హైకోర్టు బెంచ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:59 PM
హైకోర్టు బెంచను కర్నూల్‌లో ఏ ర్పాటుచేయాలని బార్ అసోసియేషన ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధ వారం స్థానిక కోర్టు ఆవరణంలో నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన ఆధ్వర్యంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు విదులను బహిష్క రిస్తున్నట్లు ప్రకటించారు.
న్యాయవాదుల డిమాండ్ - విధల బహిష్కరణ
ధర్మవరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): హైకోర్టు బెంచను కర్నూల్‌లో ఏ ర్పాటుచేయాలని బార్ అసోసియేషన ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధ వారం స్థానిక కోర్టు ఆవరణంలో నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన ఆధ్వర్యంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు విదులను బహిష్క రిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు కరీం, ప్రధాన కార్యదర్శి డీఎల్‌ఎన మూర్తి, ఉపాధ్యక్షుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ... హైకోర్టు బెంచను కర్నూల్‌లో ఏర్పాటుచే యాలని డిమాండ్‌చేశారు. హైకోర్టు బెంచను రాయలసీమలో ఏర్పాటు చేయాలని కొన్నేళ్లగా న్యాయవాదులు పలు మార్లు ఉద్యమాలు, నిరసనలు, నిరాహారదీక్షలు చేపట్టినా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. రాయలసీమ ప్రాంతవాసులు హైకోర్టుకు వెళ్లాలంటే చాలాదూరంలో ఉన్న విజయవాడ కు వెళ్లాల్సివ స్తోందన్నారు. రాయలసీమ అభివృద్దికి, రాయలసీమ వాసులకు అనుగుణంగా హైకోర్టు బెంచను కర్నూలులో ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించక పోతే నిరాహారదీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
కదిరిలీగల్: రాయలసీమలో హైకోర్టు ప్రత్యేక బెంచను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కదిరి న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. విధుల బహిష్కరణ బుధవారం నుంచి ఈ నెల 18 వరకు కొనసాగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు చౌడప్ప తెలిపారు. మొదట న్యాయవాదుల సంఘం కార్యాలయంలో సమావేశమైన న్యాయవాదులు నిరసన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం తీర్మాన కాపీలను స్థానిక కోర్టుల న్యాయాధికారులకు అందించారు. అదే విధంగా కదిరి కేంద్రంగా ఏడీజే కోర్టు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర స్థాయిలో ఽధ్వజమెత్తారు. ఒక వైపు రాజకీయంగా మరోవైపు న్యాయపరంగా పోరాటం చేసి ఏడీజే కోర్టును సాధించుకోవాలని తీర్మానాం చేశారు. హైకోర్టు బెంచను రాయలసీమలో ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘం సభ్యులు రమేష్, సురేంద్ర, న్యాయవాదులు నాగశేషయ్య, సుబ్బరాజు గుప్త, ఏ కృష్ణమూర్తి, నాగేంద్రరెడ్డి, షాఅలీమియా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....