BRIDGE: రక్షణ గోడలు లేని వంతెన
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:12 AM
మండల పరిధిలోని మోటుమర్ల గ్రామం వద్ద ఉన్న వంతెనపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాలకు పగలు, రాత్రి సమయాల్లో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే వంతెనపై రక్షణ దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు.
ధర్మవరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మోటుమర్ల గ్రామం వద్ద ఉన్న వంతెనపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాలకు పగలు, రాత్రి సమయాల్లో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే వంతెనపై రక్షణ దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు. వంతెన నిర్మించి ఏళ్లు గడుస్తున్నా రక్షణ దిమ్మెలు ఏర్పా టుచేయాలన్న ఆలోచన కూడా ఆర్ అండ్‌బీ అధికారులకు రాలేదా అని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఏ మాత్రం ఏమర పాటు వహించినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహన దారులు పేర్కొంటున్నారు. నిత్యం ఈ వంతెనపై మంత్రులు, కలెక్టర్, ఎ మ్మెల్యేలు రాకపోకలు సాగిస్తున్నా రక్షణ దిమ్మెలు వేయాలన్న ఆలోచించక పోవడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి వంతెనపై రక్షణ దిమ్మెలు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....