EMPLOYEES: సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:26 AM
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సి పల్ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరికి విన్నవించారు. వారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశా రు.
- వార్డు సచివాలయ ఉద్యోగుల వినతి
ధర్మవరం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సి పల్ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరికి విన్నవించారు. వారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశా రు. మూడునెలలుగా పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బదిలీపై వచ్చిన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఆరియర్స్ బిల్లులు చెల్లించాలని తెలిపారు. అలాగే పాటు మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులను ఆమోదించాలని విజ్ఞప్తిచేశారు. తమ సమస్యల పరిష్కారాన్ని వాయిదా వేయడం విచారకరమని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.