BUILDINGS: ప్రమాదకరంగా పాఠశాల పాత భవనాలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:53 PM
మండల కేంద్రలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో పలు భవనాలు శిథిలావస్దకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని తొలగించేది ఎప్పుడని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో గతంలో నిర్మించిన పురాతన భవనాలు చాలా ఏళ్లు గడవడంతో పైకప్పు పెచ్చులూడి, గోడలు నెర్రలు చీలి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
- తొలగించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
గాండ్లపెంట, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో పలు భవనాలు శిథిలావస్దకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని తొలగించేది ఎప్పుడని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో గతంలో నిర్మించిన పురాతన భవనాలు చాలా ఏళ్లు గడవడంతో పైకప్పు పెచ్చులూడి, గోడలు నెర్రలు చీలి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ పాత పాఠశాల భవనాల వైపు వెళుతుంటారు. ఆ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో ఎప్పుడు కూలి ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కూల్చివేయాలని సంబంధిత అధికారులకు రెండేళ్లుగా విన్నవిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే కానీ అధికారులు స్పందించరా అంటూ మండిపడుతున్నారు. అంతేగాకుండా శిఽథిలావస్థకు చేరిన పాత పాఠశాల భవనాల చుట్టూ అపరిశుభ్రత నెలకొంది. పిచ్చి మొక్కలు అధికంగా పెరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో విషపురుగులు ఎక్కువగా సంచరిస్తున్నాయని విద్యార్థులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన పాత పాఠశాల భవనాలను తొలగించి, ప్రమాదాలు జరగకుండ చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....