Home » Dharmavaram
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం లో ఉన్న ఇరిగేషన కాలువ కంపచెట్లతో నిండి, పూడిపోయింది. దీనికి తో డు కాలువలోకి వర్షపు నీరు రాకుండా కొందరు దిబ్బలు వేశారు. మరి కొందరు ఆక్రమంగా కట్టడాలు కట్టారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాలనీలో ఉన్న ఈ కాలువలోకి రా కుండా అక్రమణలు అడ్డుగా ఉన్నాయి. దీనికితోడు కాలువలో ముళ్లకంప లు పెరిగిపోయాయి.
తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.
ధర్మవరం మండలంలోని దర్శినమల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయిమనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనం తరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
గతంలో పట్టణంలో కబ్జాకు గురైన ప్రదేశాలను గుర్తించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని... ప్రజ లకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆయన శనివారం పట్ట ణంలోని రాంనగర్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టా రు.
పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లోని రైల్వే ఫ్లైఓవర్ కింద గురువారం తెల్లవారుజామున మెకానిక్ ధనుంజయ(26)ను తలపై సిమెంటు ఇటుకతో బాది దారుణంగా హత్య చేశారు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన ధనుంజయ మెకానిక్.
తిరుపతి నగరంలో మూడు రోజులుగా నిర్వహించిన బాస్కెట్‌బాల్ అమరావతి చాంపియనషిప్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచినట్టు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ(సాప్) ఆధ్వర్యంలో జాతీ య క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల18,19,20 తేదీలలో అమరావతి చాంపియనషిప్ జోనల్ స్థాయి పోటీలు నిర్వహించారన్నారు.
మహిళలు ఆర్థికాభి వృద్ధి దిశగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో మహిళల బ్యాంకు ఏర్పాటు చేశామని ఆర్డీటీ మహిళ విభాగం డైరెక్టర్ విశాలఫెర్రర్ పేర్కొన్నా రు. పట్టణంలోని షీర్డీసాయిబాబా ఫంక్షనహాల్‌లో గురువారం ఆర్డీ టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న శ్రీఅక్షర మహిళ బ్యాంకును ఆమె ప్రారంభించారు.
పట్టణంలో నిర్వహించిన ‘మీ సమస్య-మా బాధ్యత ’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం టీడీపీ నియోజకవర ్గఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ గురువారం సచివాలయాల బాట పట్టారు. పట్టణంలోని 25వ వార్డులో పార్థసారఽథి-2, 30వ వార్డు పరిధిలోని దుర్గానగర్ సచివాలయాల వద్దకు స్వయంగా వెళ్లి సచివాలయ సిబ్బందికి అర్జీ లను ఆందజేశారు. టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
త్రైత సిద్ధాంత ప్ర బోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘ నం గా నిర్వహించారు. ఈ నెల 16న కృష్ణా ష్టమి నుంచి పూజలందుకున్న శ్రీకృష్ణుడి ప్రతిమను గురువారం అలంకరించి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సేవాసమితి సభ్యులు తరలివచ్చి గ్రామోత్సవంలో భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మండల పరిధిలోని లోచర్లలో పెనుకొండ రహదారి పక్కనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. పాఠశాలకు ఎదురుగా రోడ్డు గుంతల మయం కావడంతో ఇటీవల వర్షాల కు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.