GOD: ఘనంగా కార్తీకమాస పూజలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:04 AM
పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు.
ధర్మవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు. అలాగే పట్ట ణంలోని శివానగర్ శివాల యం, గాంధీనగర్, చెరువుక ట్ట వద్దగల శివాలయాల్లో ధ్వజ స్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
ధర్మవరంరూరల్: పట్టణంలోని బసవన్నకట్ట వీధిలో వెలసిన పురాతన త్రిలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం కార్తీకమాస పూజ లు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శివలింగానికి అభిషే కాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించి, అర్చనలు చేశారు. ఆలయం ఎదుట మహిళ భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యం లో తీర్థప్రసాదాలు పంపి ణీ చేశారు.
కదిరి: కార్తీకమాసం మొదటి సోమవారం సంద ర్భంగా పట్టణంలోని శివాల యం, ఆంజనే యస్వామి ఆలయంలో భక్తులు పోటె త్తారు. ఉదయం నుంచే భక్తులు, ముఖ్యంగా మహిళ లు శివాలయంలో బారులు తీరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....