Share News

ROAD: దారంతా గుంతలే..!

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:17 PM

మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్‌ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

ROAD: దారంతా గుంతలే..!
Worse is Puttaparthi Road

రాకపోకలకు అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు

ముదిగుబ్బ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్‌ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. బ్రహ్మదేవరమర్రి, గంగిరెడ్డిపల్లి మధ్య ఈ రోడ్డు పూర్తిగా స్వరూపం కోల్పోయింది. కొండవండ్ల పల్లె నుంచి చిన్నకోట్ల, యర్రగుంట పల్లి, రాఘవపల్లి వరకు ఉన్న తారు రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఆయా రోడ్లలో ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రజలు నిత్యం అవస్థలు పడుతు న్నారు. రాత్రి వేళల్లో మలుపుల్లో వేగాన్ని అదుపు చేయలేక వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

గ్రామీణ రోడ్ల పరిస్థితి ఇలా...

- మలకవేముల క్రాస్‌ నుంచి సానేవారిపల్లి మీదుగా పి.కొట్టాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రధానంగా ఒడ్డుకింద తండా నుంచి కోటిరెడ్డిపల్లి, పాముదుర్తి కొట్టాల వరకు తారు కొట్టుకుపోయి రోడ్డు ఛిద్రమైంది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి.


- రాచువారిపల్లి తండా-దొరిగల్లు ఘాట్‌ రోడ్డు నుంచి ఒడ్డుకింద తం డాకు వెళ్లే అప్రోచ రోడ్డు దారుణంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం లో సగం దారి కంకర పరిచి వదిలేయగా మిగతా మట్టిరోడ్డు అలాగే ఉంది.

- ముదిగుబ్బ మేజర్‌ పంచాయతీలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారింది. బస్టాండ్‌ కూడలి నుంచి బైపాస్‌ బ్రిడ్జి వరకు ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి.

- పుట్టపర్తి-ముదిగుబ్బ వెళ్లే రోడ్డులో పాతూరు వద్ద రోడ్డు గుంతల మయమై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం- కంబగిరి, ఆర్‌అండ్‌బీ డీఈ, కదిరి

ముదిగుబ్బ నుంచి దొరిగల్లు రోడ్డుకు 40లక్షలు, రాళ్ల అనంతపురం క్రాస్‌ నుంచి చిన్నకోట్లకు రూ.3కోట్లతో ప్రతిపాదనలు పై అధికారులకు పంపాము, నిధులు మంజూరు అయిన వెంటనే పనులు చేపడతాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2025 | 10:17 PM