MINISTER: యువకుల ధైర్యం ఆదర్శనీయం
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:23 PM
ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
కర్నూలు బస్సు ఘటనలో
ప్రాణాలను కాపాడిన యువకులకు సన్మానం
ధర్మవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రయాణికులను కాపాడిన హరీశకుమార్, జ్ఞానేంద్ర, వంశీల ఇళ్లకు వెళ్లి అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బస్సులో చిక్కుకున్న వారిని బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండటం గర్వకారణం అన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....