Share News

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:49 PM

పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్‌చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్‌లో ఉన్న కమిషనర్‌, అధికారుల ను చైర్‌పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్‌పర్సన చాంబర్‌లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్‌ కమిషనర్‌ సాయికృష్ణను డిమాండ్‌చేశారు.

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి
The officials who are going to boycott the meeting

కౌన్సిలర్ల డిమాండ్‌

సమావేశాన్ని బాయికాట్‌ చేసిన అధికారులు

ధర్మవరం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్‌చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్‌లో ఉన్న కమిషనర్‌, అధికారుల ను చైర్‌పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్‌పర్సన చాంబర్‌లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్‌ కమిషనర్‌ సాయికృష్ణను డిమాండ్‌చేశారు. అయితే టౌనప్లానింగ్‌ అధికారి ఆఫీసు పనిమీదే నాలుగురోజులు బయటకు వెళ్లారని, తాను ఇనచార్జ్‌ కమిషనర్‌గా చార్జ్‌ తీసుకుని నెలరోజులైందని కమిషనర్‌ తెలిపారు. ఆమె వచ్చాక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చిస్తామని ఆయన సమాధా నం చెప్పడంతో కొద్దిసేపు కౌన్సిలర్లు, కమిషనర్‌ మద్య వాగ్వాదాలు జరిగాయి. అనంతరం కమిషనర్‌, అధికారులు కౌన్సిల్‌ హాల్‌కు వెళ్లారు. పది నిమిషాల తరువాత కౌన్సిలర్లు సమావేశ హాల్‌లోకి వచ్చారు. అజెం డాలోని అంశాలను మొదలు పెట్టగానే కౌన్సిలర్లు చందమూరి నారాయ ణరెడ్డి, సాయికుమార్‌ పైకిలేచి ముందుగా కౌన్సిలర్ల డిమాండ్‌ను అజెం డాలో ఎందుకు చేర్చలేదని చర్చకు దిగారు.


ఆ కాలనీలను మున్సిపాలి టీలోకి చేర్చాలంటూ నాలుగు నెలలు గా వినతిపత్రాలు అందజేసినా, ఆ అంశాన్ని అజెండాలో ఎందుకు చేర్చలే దని నిలదీశారు. కమిషనర్‌ కలుగ చేసుకుని మీరిచ్చిన వినతిపత్రాన్ని, టీడీపీ నాయకులు ఇచ్చిన వినతిపత్రా న్ని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇందుకు చైర్‌పర్సన మాట్లాడుతూ... మాటకు విలువలేదని, కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అజెండా చదవకనే అందు లోని అంశాలను తాము తీర్మానిస్తున్నామని, టేబుల్‌ అజెండాపై చర్చిద్దా మని చైర్‌పర్సన తెలుపగా అందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. అజెండా లోని అంశాలను ప్రస్తావించకనే టేబుల్‌ అజెండాపై చర్చించడం మున్సి పల్‌ నిబంధన లకు విరుద్ధమన్నారు. అయితే టేబుల్‌ అజెండాను చదవాలని చైర్‌పర్సన అనడంతో... తాము నిబంధనలకు విరుద్ధంగా ఏ పనీ చేయమంటూ కమిషనర్‌, అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో సమావేశాన్ని మమ అనిపించేశారు. అంతకు మునుపు వైస్‌ చైర్మన జయరామిరెడ్డి మాట్లాడుతూ....కుక్కల ఆపరేషన కోసం కౌన్సిల్‌లో రూ.18లక్షలు తీర్మానం చేయించి మంజూరు చేశారని, అయితే ఇంతవరకు ఒక కుక్కకు ఆపరేషన చేయలేదని, ఆ వివరాలను తెలపాలని కమిష నర్‌ను అడిగారు. ఈ సమావేశంలో కౌన్సిలర్‌లు, అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం జిల్లా వార్తల కోసం....

Updated Date - Oct 30 , 2025 | 11:49 PM