MINISTER: గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:41 AM
గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
6.10కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
ధర్మవరం రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయా. ఆయా రోడ్ల నిర్మాణానికి మంత్రి శనివారం కత్తే కొ ట్టాల గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి, టీడీపీ నాయకులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలి కారు. భూమి పూజ అనంతరం మంత్రి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి
ఈ గ్రామాలకు రహదారి లేక ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. రహదారులను త్వరతగతిన పూర్తిచేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్య మైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిమనోహర్, ఇతర శా ఖల అధికారులు, ఏపీసీడ్స్ కార్పొరేషన డైరెక్టర్ కమతం కాట మయ్య, టీడీపీ క్లస్టర్ ఇనఛార్జ్ మహేష్‌చౌదరి, బీజేపీ నాయకులు హారీష్ బాబు, మాజీ ఎంపీపీ మద్దిలేటి, టీడీపీ మండలకన్వీనర్ లక్ష్మన్న, విజయ సారథి, గొట్లూరు చంద్ర, ఆదెప్ప, కత్తేకొట్టాల ప్రసాద్, కాటమయ్య, నరసింహులు, కనంపల్లి రాజు, తెలుగుయువత విజయ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు ప్రారంభం
బత్తలపల్లి : మండలపరిధిలోని పత్యాపురం గ్రామంలో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి సత్యకుమార్ శనివారం ప్రారంభించారు. పత్యా పురం నుంచి పత్యాపురం తండా వరకు 1060 మీటర్ల బీటీ రోడ్డును రూ. 85లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో నిర్మించారు. ఈ రోడ్డును మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పత్యాపురం తండాకు రోడ్డు లేక పోవడంతో తండా వాసులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మ హేష్, తహసీల్దార్ స్వర్ణలత, సర్పంచ రమాదేవి, టీడీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, బీజేపీ నాయకులు వీరనారప్ప, భాస్కర్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....